తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సినీడైరీ: హిందీ పాటలో తెలుగు.. సూపర్​హిట్​ - shree 420

'రామయ్యా వస్తావయ్యా..' అనే సాంగ్​ బాలీవుడ్​లో ఎంతో పాపులర్. ఈ పాట పల్లవిలో ఉన్న తెలుగు పదాలను తెలుగు జానపదం గీతం నుంచి తీసుకున్నాడు సంగీత దర్శకుడు శంకర్. హైదరాబాద్​లో పుట్టి పెరిగిన ఆయనను ఆ పదాలు ఎంతో ఆకర్షించాయట.

రామయ్యా వస్తావయ్యా

By

Published : Jul 7, 2019, 9:00 PM IST

తెలుగు పాటలు హిందీలో రావడం చాలా సినిమాల్లో చూశాం. అయితే ట్యూన్ మాత్రం అలానే ఉండి పదాలు హిందీలో ఉంటాయి. కానీ ఓ బాలీవుడ్ చిత్రంలోని ఓ పాటలో తెలుగు సాహిత్యాన్ని వాడుకున్నారు. 1955లో రాజ్​కపూర్ నటించిన 'శ్రీ 420' సినిమాలో "రామయ్యా వస్తావయ్యా, రామయ్యా వస్తావయ్యా.. మైనే దిల్ తుఝ్​కో దియా" అంటూ సాగే గీతం ఉంది.

అసలు విషయం ఏమంటే ఈ సినిమాకు సంగీతం అందించిన శంకర్- జై కిషన్​లలో ఒకరైన శంకర్ హైదరాబాద్​లో పుట్టి పెరిగారు. ఇక్కడున్న రోజుల్లో తెలుగువారు పాడుకునే 'రామయ్యా వస్తావయ్యా..' అనే జానపదం గీతం ఆయనను బాగా ఆకర్షించింది. శ్రీ 420 చిత్ర పాటలు గురించి రాజ్​కపూర్​తో చర్చిస్తున్న సమయంలో శంకర్ తెలుగు పదాలతో ఓ ట్యూను వినిపించాడంట. ఆ సౌండింగ్ నచ్చిన రాజకపూర్ వాటిని యథాతథంగా పెట్టమని సంగీత దర్శకులతో చెప్పాడంట.

ఇంకేముంది అలా రూపొందిన ఆ పాట బంపర్ హిట్టైంది. పల్లవిలో తెలుగు పదాలతో ఆరంభమై మిగతా పాట అంతా హిందీలో ఉంటుంది. ఆ విధంగా బాలీవుడ్ ప్రేక్షకులకు రామయ్యా వస్తావయ్యా పదాలు సుపరిచితమయ్యాయి.

2013లో 'రామయ్యా వస్తావయ్యా' పేరుతో ఓ సినిమా కూడా వచ్చింది. ఈ చిత్రం కూడా తెలుగు రూపొందిన నువ్వొస్తానంటే నేనొద్దాంటానా సినిమాకు రీమేక్​. అ అంటే అమలాపురం పాటను ఓ హిందీ రీమిక్స్ చేసినపుడు తెలుగు పల్లవినే యథాతథంగా వాడారు.

ఇది చదవండి: వారి జీవితమే బాగుందన్న బన్నీ

ABOUT THE AUTHOR

...view details