తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఫిల్మ్​ఛాంబర్​లో మూవీమొఘల్ విగ్రహం - statue

మూవీమొఘల్​ రామానాయుడు జయంతి సందర్భంగా హైదరాబాద్​లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దగ్గుబాటి సురేష్ బాబు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు.

రామానాయుడు

By

Published : Jun 6, 2019, 5:54 PM IST

మాట్లాడుతున్న రాఘవేంద్రరావు తదితరులు

దాదా సాహెబ్ ఫాల్కే, పద్మభూషణ్ పురస్కారాల గ్రహీత ప్రముఖ నిర్మాత స్వర్గీయ దగ్గుబాటి రామానాయుడు జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయన విగ్రహాన్ని హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ ఆవరణలో ఏర్పాటు చేశారు. రామానాయుడు తనయుడు దగ్గుబాటి సురేష్ బాబు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతోపాటు నిర్మాతలు అల్లు అరవింద్, ఆదిశేషగిరిరావు, పరిచూరి బ్రదర్స్, రమేష్ ప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రామానాయుడుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details