తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'రమణా.. లోడెత్తాలిరా..' డైలాగ్‌ ప్రోమో విడుదల - సూపర్​స్టార్​ మహేశ్‌బాబు

మహేశ్‌బాబు కథానాయకుడిగా నటించిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో 'రమణా.. లోడు ఎత్తాలిరా.. చెక్‌పోస్ట్‌ పడతాది' అనే  డైలాగ్‌కు విపరీతమైన క్రేజ్​ వచ్చింది. ఈ మాటలను పలికించిన కుమనన్‌ సేతురామన్​ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఆ సన్నివేశాన్ని ప్రోమో రూపంలో విడుదల చేసింది చిత్రబృందం.

Ramana load etthaliraa
'రమణా.. లోడు ఎత్తాలిరా..' డైలాగ్‌ ప్రోమో విడుదల

By

Published : Jan 24, 2020, 8:15 PM IST

Updated : Feb 18, 2020, 6:55 AM IST

సూపర్​స్టార్​ మహేశ్‌బాబు కథానాయకుడిగా, అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. రష్మిక కథానాయిక. విజయశాంతి కీలక పాత్ర పోషించింది. మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రంలో 'రమణా.. లోడు ఎత్తాలిరా.. చెక్‌పోస్ట్‌ పడతాది' అంటూ ఒక్క డైలాగ్‌తో మంచి క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు కుమనన్‌ సేతురామన్‌. ఈ డైలాగ్‌తో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ఎక్కడ చూసిన ఈ డైలాగ్‌ ట్రెండ్‌ అవుతోంది. తాజాగా ఈ డైలాగ్‌ ప్రోమో వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది.

సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైందీ సినిమా. అద్భుతమైన వసూళ్లతో బాక్సాఫీసు వద్ద ఇప్పటికీ సందడి చేస్తోంది. ఇటీవలే ఈ సినిమా రూ.200 కోట్ల కబ్ల్‌లో అడుగుపెట్టిందని సినీ విశ్లేషకులు అంచనా వేశారు.

Last Updated : Feb 18, 2020, 6:55 AM IST

ABOUT THE AUTHOR

...view details