రామ్ పోతినేని గతంలో నో చెప్పిన ఓ దర్శకుడికి ప్రస్తుతం ఓకే చెప్పాడని టాలీవుడ్ వర్గాల టాక్. ఆ దర్శకుడు ఎవరో కాదు అనిల్ రావిపూడి. ఇతడు తెరకెక్కించిన 'రాజా ది గ్రేట్' మంచి విజయం అందుకుంది. ముందుగా ఈ సినిమా కథను రామ్‌కే వినిపించాడట అనిల్. అంధుడిగా ఛాలెంజ్ విసిరే ఆ పాత్రను ప్రేక్షకుల స్వీకరిస్తారో లేదో అని భావించి చేయలేదని అప్పట్లో వార్తలొచ్చాయి. ఆ తర్వాత రవితేజతో పట్టాలెక్కించి హిట్ అందుకున్నాడు.
అప్పుడు నో.. ఇప్పుడు ఓకే? - అనిల్ రావిపూడి రామ్
కమర్షియల్ కామెడీ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి మరో కొత్త చిత్రానికి రంగం సిద్ధం చేస్తున్నాడని సమాచారం. ఇందులో రామ్ పోతినేని హీరోగా కనపించనున్నాడని తెలుస్తోంది.
అనిల్ ఇప్పుడు మరో కథను రామ్‌కి వినిపించాడని, అతడికి బాగా నచ్చిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. చర్చల అనంతరం స్పష్టత రావొచ్చని తెలుస్తోంది. తన మార్క్ కామెడీ నేపథ్యంలో ఫుల్ ఎంటర్‌టైనర్‌ని అందించనున్నాడట అనిల్.
ప్రస్తుతం 'ఎఫ్ 3' ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు అనిల్. ఇది సెట్స్‌పైకి వెళ్లడానికి కొంచెం సమయం పడుతుండటం వల్ల కాలం వృథా చేయకుండా ఓ నాయికా ప్రాధాన్య చిత్రాన్ని ప్రారంభించే ఆలోచనలో ఉన్నాడని వినికిడి. సాయి పల్లవి ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉందని ఇటీవలే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇవి రెండు పూర్తయ్యాక రామ్ ప్రాజెక్టు మొదలవచ్చు.