దర్శకుడిగా ఎన్నో సంచలన సినిమాలు తెరకెక్కించిన రాంగోపాల్ వర్మ.. త్వరలో ఓ సినిమాలో నటించనున్నాడు. ఈరోజు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా గన్ షాట్ నిర్మాణ సంస్థ 'కోబ్రా' అనే చిత్రం చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో ఆర్జీవీ నటిస్తున్నట్లు చెప్పింది. త్వరలోనే పూర్తి వివరాలు ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు.
కోబ్రా: త్వరలో తెరపైకి రాంగోపాల్ వర్మ - ram gopal varma
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ.. కోబ్రా అనే సినిమాలో నటించనున్నాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని నిర్మాతలు తెలిపారు.
రాంగోపాల్ వర్మ
ఇటీవలే జయలలిత స్నేహితురాలు శశికళ జీవితం ఆధారంగా సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు వర్మ. ఇప్పుడు నటుడిగా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే తన సినిమాల్లో పాటలు, వాయిస్ ఓవర్ చెప్తుంటాడు ఆర్జీవీ.
ఇవీ చూడండి.. తొలి సినిమాకే ఆలియా సొంత డబ్బింగ్