తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ట్విట్టర్ వేదికగా 'డియర్ కామ్రేడ్​'పై వర్మ సెటైర్ - 'డియర్ కామ్రేడ్'​

'ఇస్మార్ట్ శంకర్'​కు పోటీగా థియేటర్ల దగ్గర సందడి చేస్తోన్న 'డియర్ కామ్రేడ్'​పై రామ్​ గోపాల్​ వర్మ ట్విట్టర్​లో ఓ పోస్ట్ పేల్చాడు. ఇప్పుడీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

'డియక్ కామ్రేడ్​'పై వర్మ సెటైర్

By

Published : Jul 30, 2019, 10:38 PM IST

Updated : Jul 31, 2019, 12:22 PM IST

'ఇస్మార్ట్ శంకర్'​కు పోటీగా నిలుస్తుందనుకున్న విజయ్‌ దేవరకొండ 'డియర్‌ కామ్రేడ్‌'కు బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ స్పందన లభిస్తోంది. తాజాగా 'ఇస్మార్ట్‌ శంకర్‌' వసూళ్లతో ‘కామ్రేడ్‌’ను పోల్చుతూ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టాడు వర్మ.

వర్మ ట్వీట్

''ఇస్మార్ట్‌ శంకర్‌' నాన్‌ఇస్మార్ట్‌ కామ్రేడ్‌ కంటే ఎక్కువ ఇస్మార్ట్‌గా ఉన్నాడా? లేక నాన్‌ ఇస్మార్ట్‌ కామ్రేడ్‌ ఇస్మార్ట్‌ శంకర్‌కన్నా ఎక్కువ ఇస్మార్ట్​గా లేడా? నిజం రామ్‌ విజయానికే తెలుసు' అంటూ దేవరకొండపై పరోక్షంగా ఓ సెటైర్‌ పేల్చాడు ఆర్జీవీ.

ఇస్మార్ట్ హిట్‌తో పూరి జగన్నాథ్ ఫుల్ జోష్​లో ఉంటే.. ఆయన గురువు వర్మ డబుల్​ జోష్​తో సందడి చేస్తున్నాడు. తన సొంత చిత్రమే హిట్‌ అయిందన్నట్లుగా ఉత్సాహంతో ఊగిపోతున్నాడు. సినిమా విడుదలై ఇప్పటికే రెండు వారాలు గడుస్తున్నా నిలకడగా వసూళ్లు దక్కించుకుంటూ ట్రేడ్‌ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది 'ఇస్మార్ట్ శంకర్'.

ఇది సంగతి: 'జాన్వీ, ఇషాన్​ది ప్రేమ కాదు..స్నేహమే'

Last Updated : Jul 31, 2019, 12:22 PM IST

ABOUT THE AUTHOR

...view details