తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మెగాస్టార్​ సినిమాలో చెర్రీ​ 15 రోజుల షూటింగ్! - megastar news

టాలీవుడ్‌ అగ్రకథానాయకుడు మెగాస్టార్‌ చిరంజీవి 152వ సినిమా షూటింగ్‌ ఇటీవలే ప్రారంభమైంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో చిరు జంటగా త్రిష నటించనుంది. ఈ సినిమాకు నిర్మాతల్లో ఒకరిగా ఉన్న రామ్​చరణ్​... ఇందులో కీలకపాత్ర పోషిస్తాడనే వార్త చర్చనీయాంశంగా మారింది.

Ram Charan to Key Role in Megastar Chiranjeevi's 152 movie
మెగాస్టార్​ సినిమాలో చెర్రీ​ 15 రోజుల షూటింగ్!

By

Published : Jan 9, 2020, 7:17 AM IST

'సైరా నరసింహారెడ్డి' తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 152వ సినిమా చిత్రీకరణ ఇటీవలే ప్రారంభమైంది. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. దేవాదాయ శాఖలో అవినీతిని అరికట్టే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కబోతోందని సమాచారం. ఈ సినిమాలో చిరు దేవాదాయ శాఖలో పనిచేసే ఉద్యోగిగా కనిపించనున్నాడట.

చిరంజీవి న్యూలుక్‌కు సంబంధించిన ఓ ఫొటో నెట్టింట్లో వైరల్​ అయింది. ఇందులో చిరంజీవి చాలా సాధారణమైన లుక్‌లో కనిపించాడు. మెగాస్టార్​ లుక్‌ చూసిన అభిమానులు ఫిదా అయిపోయారు.

15 రోజుల కాల్షీట్​...

తాజాగా చిరు తనయుడు చరణ్​ కూడా ఇందులో ఓ కీలకపాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాలో నటించేందుకు 15 రోజుల కాల్షీట్లు ఇచ్చాడట చెర్రీ. ఏప్రిల్​లో షూటింగ్​లో పాల్గొంటాడని టాలీవుడ్​ టాక్​. అప్పటికీ 'ఆర్​ఆర్​ఆర్​'చిత్రీకరణ కూడా పూర్తవుతుందట. దీనిపై అధికారిక ప్రకటన రానుంది.

ఈ చిత్రానికి మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నాడు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details