రామ్‌చరణ్-శంకర్(ram charan shankar movie) కలయికలో రూపొందుతున్న సినిమా ప్రారంభం కానుంది. ఈ నెల 22న పుణెలో షూటింగ్ మొదలు పెట్టనున్నారు. ఇప్పటికే కొబ్బరికాయ కొట్టిన ఈ చిత్రం.. తొలి షెడ్యూల్ 20 రోజులపాటు సాగనున్నట్టు తెలిసింది. పాటతో చిత్రీకరణ మొదలవనుంది. ఆ విషయాన్ని హీరోయిన్ కియారా అడ్వాణీ(kiara advani movies) స్వయంగా వెల్లడించారు.
Ram charan new movie: పాటతో చరణ్ సినిమా షూటింగ్ మొదలు
మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కొత్త సినిమా(ram charan new movie) చిత్రీకరణ పాటతో ప్రారంభం కానుంది. అక్టోబరు 22 నుంచి పుణెలో తొలి షెడ్యూల్ షురూ చేయనున్నారు.
చరణ్ కియారా అడ్వాణీ
శంకర్ సినిమాల్లో(shankar movies) పాటలకు ఉండే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. భారీ హంగులతో సెట్స్ తీర్చిదిద్ది అందులో షూటింగ్ చేస్తుంటారు. ఇందులోని పాటల్నీ అదే తరహాలో తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్‌చరణ్(ram charan movie list) యువ ఐఏఎస్ అధికారిగా కనిపిస్తారని సమాచారం. దిల్‌రాజు నిర్మిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నారు.
ఇవీ చదవండి: