మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో పాటు 'ఆచార్య'లోనూ నటిస్తున్నారు. వీటి తర్వాత చేయనున్న చిత్రాల కోసం అనేక మంది దర్శకులతో చెర్రీ చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా వీటికి బ్రేక్ వేస్తూ తన తదుపరి సినిమా ప్రకటన వెల్లడించారు చెర్రీ. ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు శంకర్‌తో సినిమా చేయబోతున్నట్లు తెలిపారు.
శంకర్ దర్శకత్వంలో చెర్రీ.. అప్డేట్ వచ్చేసింది
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తదుపరి సినిమా దర్శకుడు ఎవరో తెలిసిపోయింది. కోలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ శంకర్‌తో తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు చెర్రీ. దిల్‌రాజు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నారు.
శంకర్ దర్శకత్వంలో చెర్రీ
ఈ చిత్రానికి దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరించనున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌కు ఇది 50వ సినిమా కావడం విశేషం. అందుకే ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో భారీగా తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మిగిలిన వివరాలు త్వరలోనే వెలువడనున్నాయి.