దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న చిత్రం (రణం రౌద్రం రుధిరం) 'ఆర్ఆర్ఆర్'. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. శనివారం (మార్చి 27) చెర్రీ పుట్టినరోజు సందర్భంగా 'ఆర్ఆర్ఆర్' నుంచి సీతారామరాజు నయా అవతార్ విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇటీవలే ప్రకటించింది.
అయితే ఆ లుక్‌ను ఒకరోజు ముందుగా అంటే శుక్రవారం(మార్చి 26) సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నామని చిత్రబృందం స్పష్టం చేసింది. ఈ చిత్రంలో రామ్‌చరణ్ సరసన అలియా భట్, ఎన్టీఆర్ సరసన ఒలివియా మోరిస్ నటిస్తున్నారు. అజయ్‌దేవ్‌గన్, సముద్రఖని, శ్రియ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకురానుంది.