హిందీ సినిమా 'దే దే ప్యార్ దే' చిత్రంలో వడ్డీ షరాబన్ పాటలో తనదైన డ్యాన్స్‌తో అలరించింది రకుల్ ప్రీత్. ఈ పాటలో మందు సీసా చేతిలో పట్టుకుని పంజాబీ స్టైల్లో నర్తిస్తే సోషల్ మీడియాలో మంచి స్పందన లభించింది. కానీ ఆ సీన్ సినిమాలో కనిపించకపోవచ్చు. ఎందుకంటేసెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) ఆ సీన్‌కు కత్తెరేసింది. ఆ సన్నివేశం పూర్తిగా తొలగించడం లేదా బాటిల్ స్థానంలో పూలగుత్తి వాడమని చిత్రబృందానికి సూచించింది సెన్సార్ బోర్డు. మరో రెండు డైలాగ్స్నూ తొలగించాలని ఆదేశించింది.
రకుల్ విస్కీ బాటిల్ మిస్సయ్యిందా..! - అజయ్ దేవగణ్
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్, అందాల భామలు రకుల్, టబు కలిసి నటించిన చిత్రం 'దే దే ప్యార్ దే'. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ చిత్రంలో రకుల్ విస్కీబాటిల్తో ఆడిపాడిన సీన్‌ను సెన్సార్ బోర్డు కట్ చేసింది.
రకుల్ విస్కీ బాటిల్ మిస్సయ్యిందా..!
సినిమాకు అకీవ్ అలీ దర్శకుడు. టీ సిరీస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.