హర్రర్ కామెడీ కథాంశంతో రాబోతుంది 'రాజుగారి గది 3'. అశ్విన్, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఫస్ట్‌లుక్ వీక్షకులను అలరించగా.. ప్రస్తుతం వచ్చిన ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. రెట్టింపు హర్రర్‌తో రూపొందుతోన్న ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాలో ఓంకార్ తమ్ముడు అశ్విన్ హీరోగా నటిస్తున్నాడు. 'ఉయ్యాల జంపాల'తో ఆకట్టుకున్న అవికా గోర్ హీరోయిన్. మిల్కీ బ్యూటీ తమన్నాను కథానాయికగా మొదట ఎంపిక చేశారు. కానీ కొన్ని కారణాలతో ఆమె తప్పుకుంది. ఆ తర్వాత ఈ అవకాశం అవికాను వరించింది.