ముంబయిలో జరిగిన ఆకాశ్ అంబానీ వివాహ వేడుకలో సినీ తారలు, క్రికెటర్స్ సందడి చేశారు. తాజాగా హర్భజన్ ట్విట్టర్లో షేర్ చేసిన ఫోటో వైరల్ అవుతోంది. ఒకే ఫ్రేమ్‌లో సచిన్ తెందూల్కర్, రజనీకాంత్‌ని చూసిన అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ చిత్రంపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
సూపర్‌స్టార్ రజనీకాంత్... కూతురు సౌందర్యతో కలిసి ఈ వేడుకకు హాజరయ్యారు. తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకుంది సౌందర్య రజనీకాంత్.