తమిళ అభిమానుల్లో జోష్ నింపే వార్త ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. స్టార్ హీరోలు రజనీకాంత్-ధనుశ్(Rajinikanth-Dhanush) కలిసి ఒకే సినిమా కోసం పనిచేయనున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.
ధనుశ్ నటనే కాదు 'పా పాండీ' చిత్రంతో దర్శకత్వం చేయగలరని గతంలోనే నిరూపించుకన్నారు. ప్రస్తుతం పలు హిట్చిత్రాల్లో నటిస్తూ కెరీర్లో దూసుకెళ్తున్న ఈ మాస్హీరో తన మామ రజనీకాంత్ 170వ సినిమా కోసం రంగంలోకి దిగబోతున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి ఆయన దర్శకత్వం వహించబోతున్నట్లు సినీవర్గాల సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు కూడా జరిగాయట!. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రజనీ కూతుర్లు ఐశ్వర్య, సౌందర్య దీనిని నిర్మిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ ఇదే కనుక నిజమైతే అభిమానులకు పండగనే చెప్పాలి. ఇప్పటికే ఈ వార్త బయటకొచ్చినప్పటి నుంచి నెటిజన్లు హర్షం చేస్తున్నారు.