తన చిన్ననాటి స్నేహితురాలు, ప్రేయసి పత్రలేఖతో బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు నిశ్చితార్థం జరిగింది. చంఢీఘర్‌లో ఈ వేడుక జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి. రాజ్‌కుమార్ తన మోకాలి మీద కూర్చొని ఆమెకు రింగ్ తొడిగాడు. అనంతరం వీరిద్దరూ కలిసి డ్యాన్స్ వేశారు.
ప్రేయసితో స్టార్ నటుడి నిశ్చితార్థం - Rajkummar Rao Patralekhaa wedding
బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావుకు తన ప్రేయసి, నటి పత్రలేఖతో నిశ్చితార్థం జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
రాజ్‌కుమార్ రావు
దాదాపుగా ఏడేళ్ల నుంచి రాజ్‌కుమార్, పత్రలేఖ డేటింగ్లో ఉన్నారు. అయితే ఎప్పుడు తమ బంధంపై అధికారికంగా స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజులుగా వీరిద్దరు పెళ్లి చేసుకోనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో తాము వివాహం చేసుకోబోతున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. అయితే ఎప్పుడనేది చెప్పలేదు.
ఇదీ చూడండి: బుల్లెట్ స్పీడ్‌లో అక్షయ్.. ఒకేసారి 9 చిత్రాలు!