సూపర్‌స్టార్ రజనీకాంత్ అరుదైన ఘనత సాధించారు. తన సినీ ప్రయాణంలో 45 ఏళ్లు పూర్తిచేసుకున్నారు. పలువురు సినీ ప్రముఖులు, ఆటగాళ్లు, అభిమానుల ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తనపై ఎంతో ప్రేమను చూపిస్తూ, ఆదరిస్తూ వచ్చిన ప్రేక్షకాభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ రజనీ ట్వీట్ చేశారు.
సినీ పరిశ్రమలో నా ప్రయాణం మొదలై 45 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఎంతో ప్రేమతో శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ నా కృతజ్ఞతలు. ముఖ్యంగా నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రేక్షక దేవుళ్లకు నా హృదయపూర్వక అభినందనలు.