సూపర్‌స్టార్ రజనీకాంత్ ఏడాదికి రెండుసార్లు తన హెల్త్ చెకప్ కోసం యూఎస్ఏ వెళతారు. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా ఈ ఏడాది వెళ్లలేదు. తాజాగా కొవిడ్ మహమ్మారి విజృంభణ తగ్గిన దృష్ట్యా యూఎస్ వెళ్లడానికి రజనీ.. కేంద్రం నుంచి అనుమతి కోరారు. వెంటనే అందుకు సమ్మతం లభించింది. ఈ నేపథ్యంలో జూన్ 20న ఆయన యూఎస్ వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది.
యూఎస్‌కు రజనీ.. కేంద్రం అనుమతి - Rajinikanth seeks the central government permission
సూపర్ స్టార్ రజనీకాంత్ తన హెల్త్ చెకప్ కోసం యూఎస్ వెళ్లనున్నారు. ఇందుకోసం ఆయన కేంద్రం నుంచి అనుమతి తీసుకున్నారు.
రజనీ
కేవలం కొంతమంది కుటుంబసభ్యులతో ప్రత్యేక విమానంలో రజనీ యూఎస్ వెళ్లనున్నారు. ఈ విమానంలో 14 మంది కూర్చునే సామర్థ్యం ఉంటుంది. ఇప్పటికే హాలీవుడ్ చిత్రం 'ది గ్రే మ్యాన్' షూటింగ్ కోసం యూఎస్‌లోనే ఉన్నారు హీరో, రజనీ అల్లుడు ధనుష్.
Last Updated : Jun 14, 2021, 4:07 PM IST