తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రజనీ 'దర్బార్' పిక్ లీక్.. అభిమానులు ఫిదా - rajinikanth-police-look-leaked-from-darbar-movie

రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్​గా నటిస్తోన్న చిత్రం 'దర్బార్'. మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో రజనీ లుక్​ ఒకటి లీకై నెట్టింట్లో సందడి చేస్తోంది.

రజనీ

By

Published : Jul 24, 2019, 2:06 PM IST

రజనీకాంత్, నయనతార ప్రధానపాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'దర్బార్'. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. 25 ఏళ్ల తర్వాత రజనీ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్​గా కనిపించనున్నాడు. ముంబయి నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది.

తాజాగా ఈ సినిమాలో రజనీ గెటప్​ ఒకటి నెట్టింట్లో సందడి చేస్తోంది. పోలీస్ అవతారంలో ఉన్న రజనీని చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. లైకా ప్రొడక్షన్స్​ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.

దర్బార్ షూటింగ్​లో రజనీ

ఇవీ చూడండి.. టీజర్: ఫన్ రివెంజ్ డ్రామాగా 'గ్యాంగ్​లీడర్'

ABOUT THE AUTHOR

...view details