తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'అమ్మాయిలకు దిల్లీ.. అబ్బాయిలకు పెళ్లి సేఫ్ కాదు!'

టాలీవుడ్ రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'రాజ్​దూత్'. ఈ సినిమా టీజర్ ఆకట్టుకునేలా ఉంది.

By

Published : Jun 8, 2019, 12:51 PM IST

రాజ్​దూత్

రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా పరిచయమవుతున్న చిత్రం 'రాజ్​దూత్'. నక్షత్ర హీరోయిన్​గా చేస్తోంది. అర్జున్-కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది.

"ఒక అందమైన ఊరు, అందులో ఓ అద్భుతమైన షెడ్డు, దాంట్లో.. పని చెయ్యని రేడియో, తిరగలేని టైరు, సౌండు చెయ్యని సైలెన్సరు, బాడీ లేని హెడ్ లైట్, వీటన్నిటి మధ్యలో.. తిరుగులేని నేను".. అంటూ సునీల్ వాయిస్ ఓవర్‌తో టీజర్ మొదలవుతుంది. టీజర్​​ను బట్టిచూస్తే సినిమా మొత్తం రాజ్​దూత్ అనే బైక్ చుట్టూ తిరుగుతుందని స్పష్టంగా అర్థమవుతుంది.

ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్​లుక్​కు మంచి స్పందన వచ్చింది. తాజాగా టీజర్​ విడుదలై సినిమాపై అంచనాల్ని పెంచేసింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

ఇవీ చూడండి.. అల్లు-త్రివిక్రమ్​ సినిమాలో చిత్రలహరి హీరోయిన్​

ABOUT THE AUTHOR

...view details