సినీ నటీనటుల సంఘం ఉపాధ్యక్షుడు రాజశేఖర్ రాజీనామాను 'మా' కార్యవర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇటీవల 'మా' అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో నెలకొన్న వివాదం కారణంగా తన పదవికి రాజశేఖర్ రాజీనామా చేశాడు. రాజశేఖర్ రాజీనామా, 'మా' అసోసియేషన్లో క్రమశిక్షణ ఉల్లంఘనలపై ప్రత్యేకంగా సమావేశమైన నటీనటుల సంఘం కార్యవర్గ సభ్యులు ఈ మేరకు రాజీనామాను ఆమోదిస్తూ తీర్మానం చేశారు.
నటుడు రాజశేఖర్ రాజీనామాకు 'మా' ఆమోదం - cinema news
ఇటీవలే 'మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' డైరీ ఆవిష్కరణలో నెలకొన్న వివాదం కారణంగా తన పదవికి రాజీనామా చేశారు రాజశేఖర్. ఆదివారం దీనిని 'మా' ఆమోదించింది.
నటుడు రాజశేఖర్
అలాగే గతంలో ఉన్న క్రమశిక్షణ కమిటీని పటిష్టం చేసిన 'మా' అసోసియేషన్.. సీనియర్ నటుడు కృష్ణంరాజును ముఖ్య సలహాదారుడిగా చిరంజీవి, మురళీమోహన్ , మోహన్ బాబు, జయసుధలను కమిటీ సభ్యులుగా నియమించారు. ఈ మేరకు 'మా' అధ్యక్షుడు నరేశ్ ప్రకటన విడుదల చేశారు. ఇకపై 'మా'కు సంబంధించిన వివాదాలపై సలహా కమిటీదే తుది నిర్ణయమని అన్నాడు.