తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఎన్టీఆర్​, చరణ్​తోపాటు ప్రభాస్​ కూడా... - టాలీవుడ్

టాలీవుడ్​ ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా 'ఆర్‌.ఆర్‌.ఆర్‌'. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ కథానాయకులుగా నటిస్తున్నారు. మల్టీస్టారర్​గా వస్తోన్న ఈ చిత్రంపై భారీగా ఆశలున్నాయి. తాజాగా ఈ సినిమాలో ప్రభాస్​ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రభాస్ వాయిస్​తో రాజమౌళి చిత్రమా...!

By

Published : Apr 14, 2019, 11:26 AM IST

రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆర్​ఆర్​ఆర్' చిత్రంలో ప్రభాస్​ వాయిస్ ఉపయోగించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగులో అల్లూరి, కొమరం పాత్రల్ని వెండితెరపై ఆయన మాటలతోనే పరిచయం చేయబోతున్నారట రాజమౌళి. అంతేకాదు ఈ సినిమాలో ఓ పాత్రలోనూ ప్రభాస్​ కనిపించనున్నారట.

  • ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకున్న బ్రిటిష్‌ నటి డైసీ ఎడ్గార్‌జోన్స్ స్థానంలో నిత్యా మేన‌న్ పేరు పరిశీలనలో ఉంది. ఈ వార్తలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇటీవ‌ల రామ్​చ‌ర‌ణ్ షూటింగ్‌లో గాయ‌ప‌డ‌డం వ‌ల‌న చిత్రీక‌ర‌ణకు కాస్త బ్రేక్ ప‌డింది. వచ్చే ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. బాలీవుడ్ న‌టులు అజ‌య్ దేవ‌గ‌ణ్, అలియా భ‌ట్ ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు

ABOUT THE AUTHOR

...view details