తెలంగాణ

telangana

ETV Bharat / sitara

జక్కన్నకు జులై అంటే మక్కువ ఎక్కువా? - ntr

రాజమౌళి తెరకెక్కించిన సింహాద్రి, మగధీర, మర్యాదరామన్న, ఈగ, బాహుబలి ది బిగినింగ్ చిత్రాలు జులైలోనే విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి. రాజమౌళి 12 చిత్రాలను తెరకెక్కిస్తే అందులో ఆరు సినిమాలు జులైలోనే రావడం గమనార్హం.

ఆర్​ఆర్​ఆర్

By

Published : Mar 17, 2019, 8:00 AM IST

రాజమౌళి.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన దర్శకుడు. ఇప్పటివరకు 11 సినిమాలు తీశారు. అన్నీ సూపర్ డూపర్​ హిట్లే. ప్రతి సినిమాను వైవిధ్యంగా తెరకెక్కించే ఈ జక్కన్న.... సినిమాల విడుదల విషయంలో మాత్రం జులై సెంటిమెంట్​ను ఫాలో అవుతున్నాడు. ఆయన చేసిన సినిమాల్లో ప్రస్తుతం రాబోతున్న ఆర్​ఆర్​ఆర్​ కూడా వచ్చే ఏడాది జులైలోనే రిలీజ్ కాబోతుంది.

రాజమౌళి తెరకెక్కించిన సింహాద్రి మొదలుకుని మగధీర, మర్యాదరామన్న, ఈగ, బాహుబలి ది బిగినింగ్ చిత్రాలు జులైలోనే విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి. ప్రస్తుతం ఆర్​ఆర్​ఆర్​ కూడా 2020 జులై 30న రాబోతుంది. రాజమౌళి ఇప్పటివరకు 12 చిత్రాలు తెరకెక్కిస్తే అందులో ఆరు సినిమాలు జులైలోనే రావడం గమనార్హం.

అసలు జులైలో ఏముంది?

వేసవి సెలవులైపోయి పిల్లలంతా పాఠశాలలకు వెళ్తుంటారు. యువత కళాశాలలో పుస్తకాలతో కుస్తీపట్టే మాసం. కనీసం పండుగలు పెద్దగా ఉండవు.సినీ పరిశ్రమలో చాలామంది జులైలో సినిమాలు విడుదల చేయడానికి ఉత్సుకత చూపించరు. స్టార్ హీరోల సినిమాలన్నీ దసరా దృష్టిలో ఉంచుకుని సెప్టెంబరులో ప్రేక్షకుల ముందుకువస్తాయి.

కానీ జక్కన్న మాత్రం జులైలోనే తన చిత్రాలు విడుదల చేస్తుంటారు. సినిమాలు విడుదల కాని ఈ నెలలో చిన్న చిత్రమైనా టాక్ బాగుంటే సినిమా ఘన విజయాన్ని అందుకుంటుంది. థియేటర్లలో సినిమాలు లేకపోవడంతో ఎక్కువ మంది సక్సెస్ సినిమావైపే పరుగులు తీస్తారు.

ఈ లాజిక్ ప్రకారం రాజమౌళి సినిమా హిట్ పక్కా అనుకుని థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువుంటుంది. కావున ఇతర చిత్రాలు లేకపోవడంతో మంచి వసూళ్లను సాధిస్తాయి. అందుకే జక్కన్న తన చిత్రాలను జులైలో విడుదల చేస్తారనుకుంటా!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details