తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఒరేయ్ బుజ్జిగా' ట్రైలర్: అక్కడ మా బావ.. ఇక్కడ వీడు - raj tarun latest news

రాజ్​ తరుణ్, మాళవిక, హెబ్బా పటేల్​ నటించిన 'ఒరేయ్ బుజ్జిగా' చిత్ర ట్రైలర్ విడుదలైంది. అక్టోబరు 2న ప్రేక్షకులు ముందుకు రానుందీ సినిమా.

raj tarun orey bujjiga movie trailer
'ఒరేయ్ బుజ్జిగా' ట్రైలర్

By

Published : Sep 28, 2020, 3:22 PM IST

'ఈ ప్రపంచంలోని ప్రతి మగ వెధవ నా ప్రైవసీని డిస్టర్బ్‌ చేసేవాడే. అక్కడ మా బావ, ఇక్కడ వీడు' అని నటి మాళవిక నాయర్‌ అంటోంది. రాజ్‌ తరుణ్ హీరోగా నటించిన 'ఒరేయ్‌ బుజ్జిగా' సినిమాలో ఈమె హీరోయిన్​గా నటించింది. హెబ్బాపటేల్‌ కీలకపాత్ర పోషించింది. త్వరలో ప్రేక్షకులను అలరించనున్న ఈ చిత్ర ట్రైలర్‌ను నాగచైతన్య సోమవారం విడుదల చేశారు. ఆద్యంతం నవ్వులు పూయిస్తూ అలరిస్తోంది.

తనదొక అందమైన, అద్భుతమైన ప్రేమకథ అంటూ రాజ్‌తరుణ్‌ చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా సాగింది. విజయ్‌ కుమార్‌ కొండా దర్శకత్వం వహించారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించారు. రాధామోహన్‌ నిర్మాత.

తొలుత ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయాలని భావించినప్పటికీ లాక్‌డౌన్‌ కారణంగా ఓటీటీని ఆశ్రయించారు. అక్టోబర్‌ 2న 'ఆహా' వేదికగా ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details