తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఎవరు' బృందానికి దర్శకేంద్రుడి ప్రశంస - evaru

'ఎవరు' చిత్ర విజయంపై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు స్పందించారు. ట్విట్టర్​ వేదికగా చిత్రబృందాన్ని ప్రశంసలతో ముంచెత్తారు.

ఎవరు

By

Published : Aug 17, 2019, 3:23 PM IST

Updated : Sep 27, 2019, 7:16 AM IST

అడవి శేష్, రెజీనా, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ఎవరు'. గురువారం విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఈ విజయంపై దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు స్పందించారు. ట్విట్టర్​ వేదికగా చిత్రబృందాన్ని ప్రశంసించారు.

దర్శకేంద్రుడి ట్వీట్

"చిత్రంలోని ప్రతి సన్నివేశాన్ని ఆస్వాదించాను. ఊహించని మలుపులతో మతిపోయింది. దర్శకుడు వెంకట్ రాంజీ అనుభవమున్న వాడిలా చక్కగా తీశాడు. శేష్, రెజీనా అద్భుతంగా నటించారు. నిర్మాత పీవీపీకి, చిత్రబృందానికి శుభాకాంక్షలు" -రాఘవేంద్రరావు, ప్రముఖ దర్శకుడు

'ఎవరు' చిత్రం మొదటి షో నుంచే ప్రేక్షకాదరణ పొందుతోంది. వసూళ్ల పరంగానూ సత్తాచాటుతోంది. పీవీపీ సినిమా బ్యానర్​పై పరం వి పొట్లూరి నిర్మాతగా వ్యవహరించారు. వెంకట్ రాంజీ దర్శకత్వం వహించాడు.

ఇవీ చూడండి.. 'మోస్ట్​ హ్యండ్​సమ్ మ్యాన్'​గా హృతిక్ రోషన్

Last Updated : Sep 27, 2019, 7:16 AM IST

ABOUT THE AUTHOR

...view details