తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'నిజమే నా ట్రస్ట్​లో 21 మందికి కరోనా'

తాను నిర్వహిస్తున్న ట్రస్ట్​లో 21 మందికి కరోనా రావడం బాధ కలిగించిందని చెప్పారు నటుడు, దర్శకుడు లారెన్స్. వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించమని అభిమానుల్ని కోరారు.

'నిజమే నా ట్రస్ట్​లో 21 మందికి కరోనా'
రాఘవ లారెన్స్

By

Published : May 31, 2020, 12:39 PM IST

తాను నిర్వహిస్తున్న ట్రస్ట్‌లో 21 మంది కరోనా బారిన పడ్డారని ప్రముఖ దర్శకుడు, డ్యాన్స్‌ మాస్టర్‌ రాఘవ లారెన్స్‌ చెప్పారు. ప్రస్తుతం కోలుకుంటున్నారని, ప్రతిఒక్కరూ వారికోసం ప్రార్థించాలని కోరారు.

'అనాథ చిన్నారుల కోసం నేను ఓ ట్రస్ట్‌ నిర్వహిస్తున్నా. వారంరోజుల క్రితం ట్రస్ట్‌లోని కొంతమంది చిన్నారుల్లో జ్వరంతోపాటు ఇతర కొవిడ్‌-19 లక్షణాలు కనిపించాయి. వెంటనే కరోనా టెస్టులు చేయించగా అందులో 18 మంది చిన్నారులకు, ముగ్గురు సిబ్బందికి పాజిటివ్‌గా తేలింది. ఆ ముగ్గురు సిబ్బందిలో ఇద్దరు దివ్యాంగులు. ఈ వార్త నన్ను బాధకు గురిచేసింది. వాళ్లు త్వరితగతిన కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకున్న ఎస్పీ వేలుమణికి ధన్యవాదాలు. నేను చేసిన సేవ, సాయం నా చిన్నారులను కాపాడుతుందని భావిస్తున్నా. చిన్నారులు వెంటనే కోలుకోవాలని ప్రతిఒక్కరూ దేవుడ్ని ప్రార్థించండి' -రాఘవ లారెన్స్‌, ప్రముఖ దర్శకుడు, నృత్య దర్శకుడు

కరోనాపై పోరాటం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, సినీ పరిశ్రమలోని కార్మికుల సంక్షేమం కోసం రాఘవ లారెన్స్‌.. ఇప్పటికే రూ.3 కోట్లను విరాళంగా ప్రకటించారు. దీనితోపాటే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు తన వంతు సాయమందించారు. ఆయా కుటుంబాలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు.

గతేడాది విడుదలైన 'కాంచన-3'లో లారెన్స్ నటించారు. ప్రస్తుతం అక్షయ్ కుమార్‌ హీరోగా నటిస్తున్న 'లక్ష్మీ బాంబ్‌' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 'కాంచన-2' రీమేక్‌గా దీనిని తీస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఈ సినిమా షూటింగ్‌ వాయిదా వేశారు.

ABOUT THE AUTHOR

...view details