రావణాసురుడు ట్విట్టర్ ఖాతా ప్రారంభించడం ఏంటి? అని ఆశ్చర్యపోకండి. ప్రస్తుతం దూరదర్శన్‌లో మళ్లీ ప్రసారమవుతున్న 'రామాయణ్'లో రావణ్ పాత్ర పోషించిన అర్వింద్ త్రివేది.. తాజాగా ట్విట్టర్లో అడుగుపెట్టారు. లాక్డౌన్ నియమాలు పాటిస్తూ ఇంట్లోనే ఉండాలని అభిమానులకు సూచిస్తూ ఓ వీడియోను పోస్ట్ చేశారు.
ట్విట్టర్లో అడుగుపెట్టిన రావణాసురుడు - Raavan in Ramayana
'రామాయణ్' సీరియల్లో రావణుడిగా అలరించిన అర్వింద్ త్రివేది.. తాజాగా ట్విట్టర్లో అడుగుపెట్టారు. ఇంట్లోనే ఉండాలని అభిమానులకు సూచించారు.
అర్వింద్ త్రివేది
"మా పిల్లలు చెప్పడం, మీ ప్రేమాభిమానాల వల్లే ట్విట్టర్ ఖాతా ప్రారంభించాను. #RaavanOnTwitter అనే హ్యాష్‌టాగ్‌తో ఎవరు ట్వీట్ చేసినా, మరో ఆలోచన లేకుండా వారిని ఫాలో అవుతా. జైశ్రీరామ్. ఓం నమఃశివాయ" -అర్వింద్ త్రివేది, ప్రముఖ నటుడు
మన జీవితానికి యోగా ఎంత ఉపయోగమో తెలిపే సమాచారాన్ని షేర్ చేస్తున్నారు అర్వింద్. 'రామాయణ్' సీరియల్‌కు సంబంధించిన పాత ఫొటోలను అభిమానులతో పంచుకుంటున్నారు.