తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌' కోసం రాశీఖన్నా తొలిసారి! - cinema news

హీరోయిన్​ రాశీఖన్నా తొలిసారి తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంది. ఆ ఫొటోను ట్విట్టర్​లో పంచుకుంది.

'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌' కోసం రాశీఖన్నా తొలిసారి!

By

Published : Nov 7, 2019, 6:31 AM IST

Updated : Nov 7, 2019, 7:20 AM IST

యువహీరో విజయ్‌ దేవరకొండ నటిస్తున్న సినిమా 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌'. ఇటీవల విడుదల చేసినఫస్ట్​లుక్ఆకట్టుకుంటూ అంచనాల్ని పెంచుతోంది. ఈ చిత్రంలోని ఓ కథానాయిక రాశీఖన్నా.. తన పాత్రకు డబ్బింగ్​ చెప్పడం ప్రారంభించింది. ఆ ఫొటోను ట్విట్టర్​లో పంచుకుంది.

'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌' కోసం డబ్బింగ్ చెబుతోన్న రాశీఖన్నా

"నేను డబ్బింగ్‌ చెప్తున్న నా తొలి చిత్రమిది. నా గాత్రం, ఉచ్చరణ పాత్రకు నప్పుతాయో లేదోననే భయం ఉండేది. కానీ, పూర్తయిన తర్వాత నేనే నమ్మలేకపోయాను. మీరు ఎప్పుడెప్పుడు వింటారా అని ఎదురుచూడటం నా వల్ల కాదు" -ట్విట్టర్​లో రాశీఖన్నా

ఇప్పటి వరకు పాత్రకు గాత్రం అందించకపోయినా.. 'జోరు' సినిమాలో ఓ పాట పాడి అందరిని అలరించింది రాశీఖన్నా.

'వరల్డ్ ఫేమస్ లవర్​'లో ఐశ్వర్య రాజేశ్, క్యాథరీన్‌, ఇస్​బెల్లా మిగతా హీరోయిన్లు. గోపీసుందర్ సంగీతమందిస్తున్నాడు. క్రాంతి మాధవ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. క్రియేటివ్ కమర్షియల్స్​ పతాకంపై కె.ఏ.వల్లభ నిర్మిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

Last Updated : Nov 7, 2019, 7:20 AM IST

ABOUT THE AUTHOR

...view details