Unstoppable With NBK: బాలయ్య 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే' కొత్త ఎపిసోడ్‌కు టైమ్ ఫిక్సయింది. ఇందులో భాగంగా 'పుష్ప' హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక, డైరెక్టర్ సుకుమార్ షోలో సందడి చేయనున్నారు. ఆదివారం రాత్రి 8 గంటల నుంచి ఆహా ఓటీటీలో ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు. ఇప్పటికే రిలీజైన ఓ వీడియోలో బాలయ్య.. 'పుష్ప' మేనరిజంతో పాటు డైలాగ్ కూడా చెప్పి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరచడం విశేషం.
థియేటర్లలో దుమ్ములేపుతున్న 'పుష్ప'.. వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.229 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంగా తీసిన ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక కథానాయిక. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. సుకుమార్ డైరెక్టర్.
Samantha yashoda movie: సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'యశోద'. థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ శనివారంతో పూర్తయింది.
ఇందులో వరలక్ష్మి శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్ లాంటి స్టార్స్ నటిస్తున్నారు. శివలెంక కృష్ణప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తుండగా, హరి-హరీశ్ ద్వయం డైరెక్షన్ చేస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రం థియేటర్లలోకి రావొచ్చు.