Pushpa release postponed: సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' కోసం ఎదురు చూసిన అభిమానులకు థియేటర్లలో ఫుల్ మీల్స్ పెట్టేశారంట. ట్విట్టర్లో ఇప్పటికే సినిమాకు మంచి రివ్యూలు వస్తున్నాయి. బన్నీ తన ప్రదర్శనతో ఇరగదీశాడంట. దేశవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని తొలుత మేకర్స్ భావించారు. అనుకున్న సమయానికే విడుదల చేసేందుకు చాలా శ్రమించారు. అయితే ఒక భాషలో మాత్రం ఈ సినిమా శుక్రవారం విడుదల కావడం లేదని తెలుస్తోంది. అదే మలయాళం.
'పుష్ప'.. ఆ భాషలో విడుదల వాయిదా! - రష్మిక మందన
Pushpa release postponed: ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 'పుష్ప' రాజ్ వచ్చేశాడు. దేశవ్యాప్తంగా థియేటర్లలో శుక్రవారం విడుదలైన ఈ సినిమా.. అభిమానులు ఊపేస్తోంది. అయితే ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేయగా.. మలయాళం వెర్షన్ మాత్రం శనివారానికి వాయిదా పడినట్లు సమాచారం.
పుష్ప
కేరళలో బన్నీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అతడిని ప్రేమగా మల్లు అర్జున్ అని కూడా పిలుచుకుంటారు. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ సినిమా డిసెంబర్ 18న మలయాళం వెర్షన్ విడుదలవుతుందని సమాచారం. అప్పటివరకు తమిళ భాష ప్రింట్‌ను కేరళలో ప్రదర్శిస్తారట.
ఇదీ చూడండి:పుష్ప సినిమా.. ఛాలెంజ్ చేసిన అల్లు అర్జున్