తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Pushpa Review: 'మాస్​ సినిమాకు సరికొత్త డెఫినిషన్​ 'పుష్ప'' - rashmika pushpa

Pushpa movie reaction: బన్నీ 'పుష్ప' సినిమా సాధారణ అభిమానులనే కాకుండా టాలీవుడ్​ డైరెక్టర్లను మెప్పించింది. ఈ సందర్భంగా తమ తమ అభిప్రాయాలను పలువురు దర్శకులు వెల్లడించారు.

pushpa movie review
పుష్ప మూవీ రివ్యూ

By

Published : Dec 17, 2021, 6:21 PM IST

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్​లో తెరకెక్కిన 'పుష్ప' మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగుతోపాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సుమారు 3 వేలకుపైగా థియేటర్లలో ఈ చిత్రం విడుదలైంది. అన్ని కేంద్రాల్లోనూ ప్రేక్షకుల ఆదరణతో మంచి టాక్ సంపాదించుకుంది. సామాజిక మాద్యమాల్లోనూ అల్లు అర్జున్ అభిమానులు, పలువురు దర్శకులు, నటీనటులు పుష్ప చిత్రాన్ని, బన్నీ నటనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

అల్లు అర్జున్ పుష్ప

అల్లు అర్జున్ కెరీర్​లో ఉత్తమ ప్రదర్శనగా పుష్ప నిలిచిందని హరీశ్ శంకర్ తన అభిప్రాయాన్ని వెల్లడించగా.. సుకుమార్, అల్లు అర్జున్ కలయిక మరోసారి చాలా బాగుందని, నిర్మాణ సంస్థ మైత్రీకి గోపీచంద్ మలినేని అభినందనలు తెలిపారు.

పేరులో 'పుష్ప ది రైజ్' అయినా.. సినిమా మొత్తాన్ని బన్నీ రూల్ చేశారని, తన ఆహార్యం, భాష ఎంతో ఆకట్టుకున్నాయని డైరెక్టర్ మారుతి తెలిపారు. మాస్ సినిమాకు పుష్ప చిత్రం సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చిందని అన్నారు. అలాగే ఈ ఏడాది చివరి రోజుల్లో టాలీవుడ్​కు 'పుష్ప' మంచి కిక్ ఇచ్చిందని మారుతి ఆనందం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details