తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Pushpa Movie: ''అఖండ' విజయం మాకు బూస్ట్​ ఇచ్చింది'​ - పుష్ప సినిమా వార్తలు

Pushpa Movie News: లాక్​డౌన్​ తర్వాత విడుదలైన 'అఖండ' చిత్రం భారీ విజయం సాధించి.. తమకు బూస్ట్​ ఇచ్చిందని 'పుష్ప' నిర్మాతలు అన్నారు. ఇక పుష్ప సినిమాలో ది బెస్ట్​ అల్లుఅర్జున్​ను చూస్తారని తెలిపారు.

pushpa movie
పుష్ప మూవీ టీం

By

Published : Dec 10, 2021, 4:21 PM IST

Pushpa Movie News: 'పుష్ప'లో ప్రతి క్యారెక్టర్ కొత్తగా ఉంటుందని, సినిమా ఐదు నిమిషాలు కూడా బోర్​ కొట్టదని చిత్రనిర్మాతలు నవీన్ యెర్నేని, మోహన్ చెరుకూరి, వై. రవిశంకర్ తెలిపారు. 'అఖండ' చిత్రం సాధించిన విజయం.. తమకు బూస్ట్​ ఇచ్చిందన్నారు.

'పుష్ప' కూడా అదేబాటలో బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తుందని నమ్మకంతో ఉన్నామన్నారు. చిత్రంలోని సాంగ్స్​ ఇప్పటికే భారీవిజయం సాధించాయని తెలిపారు. సమంత ప్రత్యేక సాంగ్​ను శుక్రవారం సాయత్రం విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.

ది బెస్ట్ అల్లుఅర్జున్​..

మనుషులు ఎవరూ వెళ్లలేని కష్టమైన లొకేషన్స్​లో సినిమా చిత్రీకరణ జరిగిందన్నారు. సినిమాలో కొత్త అల్లుఅర్జున్​ను​ చూస్తారని నిర్మాత వై. రవికుమార్ తెలిపారు. ట్రైలర్​ విశేష స్పందన వచ్చిందన్నారు. విలన్ పాత్రలో ఫహద్ ఫాజిల్ నటన షాక్​కు గురిచేస్తుందన్నారు. పుష్ప రెండో పార్ట్​ చిత్రీకరణ ఫిబ్రవరిలో మొదలు పెడతామని నిర్మాత నవీన్​ వివరించారు. 'తగ్గేదేలే' అన్న పదం పాపులర్ అవ్వడానికే అన్ని భాషల్లో ఆ పదం అలాగే పెట్టామన్నారు. సినిమాలో ది బెస్ట్ అల్లుఅర్జున్​ను చూస్తారని తెలిపారు. మల్టీస్టారర్​ చిత్రాలు చేయడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటామన్నారు.

Pushpa Release Date: శేషాచలం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్య కథతో తీసిన ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి పార్ట్.. ఈ డిసెంబరు 17న పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి.

ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందించగా, సుకుమార్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్​​ భారీ బడ్జెట్​తో నిర్మించింది.

ఇదీ చూడండి:''ఆర్​ఆర్​ఆర్'​ ట్రైలర్ చూస్తుంటే గర్వంగా ఉంది'

ABOUT THE AUTHOR

...view details