Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప'.. కలెక్షన్లలో దూసుకుపోతోంది. ఐదు భారతీయ భాషల్లో డిసెంబర్ 17న విడుదలైన ఈ సినిమా ఓవర్సీస్లోనూ జోరు చూపిస్తోంది. తాజాగా ఈ చిత్రం యూఎస్ఏలో 2 మిలియన్ డాలర్లను వసూళు చేసినట్లు చిత్రబృందం వెల్లడించింది. దీంతో ఈ ఏడాదిలో యూఎస్‌లో ఈ మైలురాయిని అందుకున్న తొలి దక్షిణాది చిత్రంగా 'పుష్ప' నిలిచిందని పేర్కొంది.
కాకినాడ సక్సెస్ మీట్ వాయిదా
పుష్ప విజయంతో జోరుమీదున్న చిత్రబృందం విజయోత్సవ వేడుకలు ఘనంగా జరుపుతోంది. ఈ క్రమంలోనే శుక్రవారం కాకినాడలో సక్సెస్ మీట్ జరగాల్సి ఉంది. కానీ అధికారులు అనుమతి ఇవ్వకపోవడం వల్ల ఈ వేడుకను వాయిదా వేసినట్లు తెలిపింది చిత్రబృందం. అభిమానులకు క్షమాపణలు తెలియజేస్తూ ఓ ట్వీట్ చేసింది.
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్గా నటించింది. ఫాహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషించారు. పుష్పరాజ్‌గా బన్నీ నటనకు ఇప్పటికే విమర్శకుల ప్రశంసలు అందుతున్నాయి. త్వరలోనే పార్ట్2ను (పుష్ప: ది రూల్) తెరకెక్కించనున్నారు సుకుమార్.