పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న 'ఫైటర్' సినిమా చిత్రీకరణ కరోనా వల్ల ఆగిపోయిన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ డిసెంబర్ నుంచి రంగంలోకి దిగబోతున్నారు.
'ఫైటర్' కోసం డిసెంబర్లో రంగంలోకి.. - fighter movie december
కరోనా వల్ల ఆగిపోయిన విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ 'ఫైటర్' సినిమా చిత్రీకరణ డిసెంబర్లో మొదలు కానుంది. ఆ నెలలోనే విజయ్ సెట్లో అడుగుపెడతారని సమాచారం.
వాళ్ల కోసమే 'ఫైటర్' చిత్ర బృందం ఎదురుచూపులు
అంతకుముందు ముంబయిలో సుదీర్ఘమైన షెడ్యూల్ చేశారు. అయితే.. కరోనావల్ల చిత్రీకరణ ఆగిపోయింది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో విదేశీ ఫైటర్లు కనిపిస్తారట. వాళ్ల రాకకోసమే చిత్రబృందం ఎదురు చూస్తున్నట్టు తెలిసింది. ఇందులో విజయ్ సరసన బాలీవుడ్ భామ అనన్య పాండే నటిస్తోంది.
Last Updated : Oct 23, 2020, 10:00 AM IST