తెలంగాణ

telangana

ETV Bharat / sitara

విజయ్​తోనే పూరి 'జనగణమన'.. కొత్త చిత్రాలతో వరుణ్ తేజ్, సూర్య - penny song

Jana Gana Mana Movie Vijay Devarakonda: కొత్త సినిమాల అప్డేట్లు వచ్చేశాయి. దర్శకుడు పూరి జగన్నాథ్ తన కలల ప్రాజెక్టు 'జనగణమన'ను విజయ్​ దేవరకొండతో చేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో పాటే మెగాహీరో వరణ్ తేజ్, సూర్య కొత్త చిత్రాల విశేషాలు ఇందులో ఉన్నాయి.

varun tej new movie
Jana Gana Mana Movie Vijay Devarakonda

By

Published : Mar 28, 2022, 12:08 PM IST

Jana Gana Mana Movie Vijay Devarakonda: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్​.. తన కలల ప్రాజెక్టు 'జనగణమన'ను విజయ్ దేవరకొండతోనే తెరకెక్కించనున్నారు. ఈమేరకు అధికారికంగా ప్రకటించారు. మార్చి 29న ఈ మిషన్​ను లాంచ్​ చేయనున్నట్లు తెలిపారు.

'జనగణమన'

ఇప్పటికే విజయ్​తో కలిసి 'లైగర్'​ సినిమా తెరకెక్కిస్తున్నారు పూరి. పూరీ కనెక్ట్స్‌, ధర్మ ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రముఖ బాక్సర్‌ మైక్‌టైసన్‌ కీలక పాత్ర పోషించారు. విజయ్‌ సరసన అనన్య పాండే సందడి చేయనుంది. ఈ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకురానుంది.

పూజా కార్యక్రమం

వరుణ్ కొత్త సినిమా: మెగాప్రిన్స్​ వరుణ్​ తేజ్​ తన కొత్త చిత్రాన్ని పూజా కార్యక్రమంతో ప్రారంభించారు. వరుణ్​పై తండ్రి నాగబాబు క్లాప్​ కొట్టగా, తల్లి పద్మజ కెమేరా స్విచ్​ఆన్​ చేశారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేయనున్న ఈ సినిమాకు బీవీఎస్​ఎన్​ ప్రసాద్ నిర్మాత. మిక్కీజే మేయర్​ సంగీతం అందించనున్నారు. ఇతర వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

వరుణ్​పై నాగబాబు క్లాప్​

టీజర్​తో నాగశౌర్య: నాగశౌర్య నటిస్తోన్న కొత్త చిత్రం 'కృష్ణ వ్రిందా విహారి'. అనీశ్‌ ఆర్‌. కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌+కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా సిద్ధమవుతోంది. సోమవారం ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

నాగశౌర్య నటన, కామెడీ టైమింగ్, షిర్లే సెతియాతో కెమిస్ట్రీ యువతను ఆకర్షించేలా ఉంది. ఐరా క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఉషా మూల్పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వేసవి కానుకగా ఏప్రిల్‌ 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

బాలాతో మరోసారి సూర్య: దర్శకుడు బాలాతో తమిళ స్టార్​ హీరో సూర్య చేస్తున్న కొత్త సినిమా షూటింగ్​ను నేడు (సోమవారం) ప్రారంభించారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమాలో సూర్య ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. ఈ కథ సముద్ర తీర ప్రాంతం నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. ఇందులో కీర్తిసురేష్‌ కథానాయికగా నటిస్తోంది. సూర్య ప్రస్తుతం వెట్రిమారన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'వాడీ వాసల్‌'లో నటిస్తున్నారు.

సూర్య కొత్త చిత్రం

Peny song:ప్రతి రూపాయి విలువను తెలియజేస్తూ సూపర్​స్టార్​ మహేశ్​బాబు నటించిన 'పెన్నీ' సాంగ్​ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మహేశ్​ యంగ్​ లుక్​, ఆయన కూతురు సితారతో కలిసి స్టెప్పులేయడం వల్ల ఈ పాట ఫ్యాన్స్​లో మరింత జోష్​ను నింపింది. దీంతో ఈ పాట మేకింగ్​ వీడియోను విడుదల చేశారు మేకర్స్. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చూడండి:Oscars 2022: ఉత్తమ నటుడు విల్​స్మిత్​.. ఆస్కార్​ విజేతలు వీరే

ABOUT THE AUTHOR

...view details