తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పోసానికి నటి పూనమ్​ కౌర్​ కౌంటర్​ - వకీల్​సాబ్​

'వకీల్​సాబ్'​ గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ నటుడు పోసాని కృష్ణమురళిపై నటి పూనమ్​కౌర్​ చేసిన ట్వీట్​ వైరల్​గా మారింది. ప్రస్తుతం ఈ విషయమై సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు!

vakeelsaab
వకీల్​సాబ్​

By

Published : Apr 10, 2021, 3:27 PM IST

Updated : Apr 10, 2021, 3:44 PM IST

పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​ నటించిన 'వకీల్​సాబ్'​ సినిమాపై సామాజిక మాధ్యమాల్లో వార్​ జరుగుతోంది. ఈ క్రమంలోనే నటి పూనమ్​కౌర్​ ట్విట్టర్​ వేదికగా ఓ షాకింగ్​ కామెంట్​ చేసింది.

"మంచి కంటెంట్​ ఉన్న సినిమాను ఎవరు చేసినా ప్రోత్సాహించాలి. కానీ 'డిఫేమింగ్​​ ఆర్గనైజ్డ్​ ట్రెండ్'​​ ఏంటో? ఇప్పుడు ఎవరు చేస్తున్నారో కుళ్లు రాజకీయాలు?. అమ్మాయిలను డీఫేమ్​ చేసి రాజకీయం చేస్తే తప్పు కాదు. అమ్మాయిలను రక్షించే సినిమా తీస్తే సమస్య ఎవరికి? పోసానిగారు ప్రెస్​మీట్​?" అంటూ పోసాని మురళికి కౌంటర్​ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్​ వైరల్​గా మారింది.

బాలీవుడ్‌ హిట్​ 'పింక్‌'కు రీమేక్‌గా తీసిన 'వకీల్‌సాబ్‌'.. ఏప్రిల్​ 9న విడుదలై పాజిటివ్ టాక్​ తెచ్చుకుంది. బోనీకపూర్‌ సమర్పణలో దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. నివేదా థామస్‌, అనన్య, అంజలి కీలకపాత్రల్లో కనిపించారు. శ్రుతిహాసన్​ హీరోయిన్​. ప్రకాశ్‌రాజ్‌ ముఖ్యభూమిక పోషించారు.

​ఇదీ చూడండి:'వకీల్​సాబ్​'పై మెగా హీరోల ప్రశంసలు

Last Updated : Apr 10, 2021, 3:44 PM IST

ABOUT THE AUTHOR

...view details