దాదాపు రెండేళ్ల క్రితమే హరీశ్ శంకర్‌తో పవన్ కలిసి పనిచేయనున్నట్లు ప్రకటించారు. 'గబ్బర్‌సింగ్' కాంబో మరోసారి అనగానే అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తవగా, సెట్స్‌పైకి వెళ్లేందుకు చాలా ఇంకా సమయం పట్టేలా కనిపిస్తోంది. అయితే ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ విడుదలపై చాలా వార్తలు వచ్చాయి. నెట్టింట్లో పలు పోస్టర్లూ సందడి చేశాయి. తాజాగా దీనిపై స్పందించింది నిర్మాణ సంస్థ. కరోనా కారణంగా ఫస్ట్‌లుక్‌కు ఇంకాస్త సమయం పడుతుందని వెల్లడించింది.
"ఉగాదికి మా సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ విడుదల చేద్దామని భావించాం. కానీ కరోనా కారణంగా అది వాయిదా పడింది. సోషల్ మీడియాలో ఈ మూవీకి సంబంధించిన చాలా లుక్‌లు కనిపిస్తున్నాయి. కానీ సినిమాకు సంబంధించిన ఏ అధికారిక పోస్టర్, లుక్ అయినా మా అధికారిక ఖాతా ద్వారానే వెల్లడిస్తాం. సరైన సమయంలో ప్రకటన చేస్తాం."