తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రముఖ నిర్మాత బి.వెంకట్రామిరెడ్డి మృతి - producer

చెన్నైలో ప్రముఖ నిర్మాత బి. వెంకట్రామిరెడ్డి మృతి చెందారు. చెన్నైలోని నెసపాక్కంలో నేడు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. తెలుగులో భైరవ ద్వీపం, శ్రీ కృష్ణార్జున విజయం లాంటి సినిమాలు నిర్మించారు.

నిర్మాత

By

Published : May 13, 2019, 6:50 AM IST

ప్రముఖ నిర్మాత బి.నాగిరెడ్డి కుమారుడు బి.వెంట్రామిరెడ్డి మరణించారు. 75 ఏళ్ల ఆయన అనారోగ్యంతో చెన్నైలో చనిపోయారు. తెలుగులో చందమామ విజయా కంబైన్స్​ పతాకంపై బాలకృష్ణతో భైరవ ధ్వీపం, శ్రీ కృష్ణార్జున విజయం, రాజేంద్ర ప్రసాద్​తో బృందావనం తదితర చిత్రాలనువెంకట్రామి రెడ్డి నిర్మించారు.

తమిళంలో విజయ్, అజిత్, విశాల్, ధనుష్ లాంటి హీరోలతో కలిసి పనిచేశారు. అజిత్​తో వీరం, విజయ్​తో భైరవ, తామిరభరణి, పడిక్కాదవన్, వేంగై లాంటి సినిమాలు నిర్మించారు. ప్రస్తుతం విజయ్ సేతుపతితో ఆయన నిర్మిస్తున్న సంఘ తమిళన్ చిత్రం షూటింగ్ దశలో ఉంది. వెంకట్రామిరెడ్డి మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details