తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నెట్టింట ప్రియాంక హాట్​ ఫొటో.. షాకైన సోదరి పరిణీతి - ప్రియాంక చోప్రా నికో జోనస్

బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా సోషల్ మీడియాలో కొన్ని ఘాటైన ఫొటోలు పోస్ట్ చేసింది. ఆ చిత్రాలను చూసిన ఆమె సోదరి పరిణీతి షాకైంది.

priyanka
ప్రియాంక

By

Published : Aug 30, 2021, 3:14 PM IST

బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా భర్త నికో జోనస్​తో కలిసి బీచ్​లో ఎంజాయ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఈ ఫొటోలు కాస్త శ్రుతి మించి ఉండటం వల్ల కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రియాంక సోదరి పరిణీతి కూడా ఆ ఫొటోకు ఫన్నీ రిప్లై ఇచ్చింది.

"అక్క.. ఏం జరుగుతోంది అక్కడ. ఇన్​స్టాగ్రామ్​లో ఫ్యామిలీ ఉంది. కళ్లు మూసి ఫొటోలు లైక్ కొట్టాల్సి వస్తోంది" అంటూ కామెంట్ చేసింది. కాస్త అనుమానంతో మరోసారి ఆ ఫొటోకు కామెంట్ చేసిన పరిణీతి. "దయచేసి అక్కడ ఏం జరుగుతుందో చెప్పండి. కళ్లు మూసుకుని లైక్ బటన్ నొక్కాల్సి వస్తోంది".. అంటూ రిప్లై ఇచ్చింది.

ప్రస్తుతం 'సిటాడెల్' అనే అంతర్జాతీయ సిరీస్​ షూటింగ్​లో బిజీగా ఉంది ప్రియాంక. ఆ తర్వాత ఫర్హాన్ అక్తర్ తెరకెక్కించబోయే బాలీవుడ్ చిత్రం 'జీ లే జరా' చిత్రీకరణలో పాల్గొననుంది. ఈ మూవీలో ప్రియాంకతో పాటు కత్రినా కైఫ్, ఆలియా భట్ ప్రధానపాత్రలు పోషించనున్నారు.

ఇవీ చూడండి: 'సాహో' బ్యూటీ పెళ్లి- స్పందించిన తండ్రి!

ABOUT THE AUTHOR

...view details