తెలంగాణ

telangana

ETV Bharat / sitara

భర్తను ఏడిపించిన ప్రియాంక చోప్రా!

'ద స్కై ఈజ్ పింక్' చిత్రీకరణ సమయంలో నిక్ జోనాస్​ను ఏడిపించిందంట ప్రియాంక చోప్రా. షూటింగ్​కు వచ్చిన నిక్ తన నటన చూసి భావోద్వేగం చెందాడని తెలిపిందీ బాలీవుడ్ భామ.

ప్రియాంక చోప్రా - నిక్ జోనాస్

By

Published : Sep 8, 2019, 10:06 AM IST

Updated : Sep 29, 2019, 8:48 PM IST

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనాస్​ను ఏడిపించిందంట. అదేంటి గత ఏడాదే కదా వీరికి పెళ్లైంది అప్పుడే గొడవలవుతున్నాయా? అని అనుకోకండి. ప్రియాంక నటించిన ద స్కై ఈజ్ పింక్ సినిమాలోని సన్నివేశం చూసి నిక్ భావోద్వేగానికి లోనయ్యాడట. ఈ విషయం ఆమె స్వయంగా చెప్పింది.

టొరంటో అంతర్జాతీయ చలనిచిత్రోత్సవాలకు భర్తతో కలిసి హాజరైన ప్రియాంక ఈ విషయాన్ని పంచుకుంది. ఆమె కొత్త చిత్రం ద స్కై ఈజ్ పింక్ షూటింగ్​కు వచ్చిన నిక్.. ప్రియాంక నటనకు ముగ్ధుడై భావోద్వేగం చెందాడని తెలిపింది. తమ వివాహం నాలుగు రోజుల్లో ఉందనగా ఈ సంఘటన జరిగిందని చెప్పింది.

"ఆ విషయం ఇప్పుడు చాలా ఫన్నీగా ఉంది. అప్పటికి వివాహానికి నాలుగురోజులే ఉంది. షూటింగ్​కు వస్తానని తను(నిక్) నాతో అన్నాడు. నేను ముందే సెట్స్​కు వెళ్లాను. సినిమాలో కీలక సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నారు. నేను లీనమై నటిస్తున్నా. అప్పటికే వచ్చిన నిక్ ఆ సీన్​ చూసి కంట తడిపెట్టుకున్నాడు. అనంతరం దర్శకురాలు షోనాలి నా దగ్గరకు వచ్చి.. నీ భర్తనే నువ్వు ఏడిపించావ్.. సినిమాలో ఇది గొప్ప సన్నివేశంగా మిగిలిపోతుంది అని చెప్పింది" -ప్రియాంక చోప్రా, బాలీవుడ్ నటి

ద స్కై ఈజ్ పింక్​

ఫర్హాన్ అక్తర్, జైరా వసీమ్, ప్రియాంక చోప్రా నటిస్తున్న ద స్కై ఈజ్ పింక్ చిత్రం అక్టోబరు 11న విడుదల కానుంది. షోనాలి బోస్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సిద్ధార్థ్ రాయ్ కపూర్, ప్రియాంక చోప్రా తదితరులు నిర్మిస్తున్నారు.

ఇది చదవండి: వర్మ ఎన్నిసార్లు జైలుకు వెళ్లాడో తెలుసా ..?

Last Updated : Sep 29, 2019, 8:48 PM IST

ABOUT THE AUTHOR

...view details