కరోనా ప్రభావంతో ఈ ఏడాది జూన్‌లో జరగాల్సిన కేన్స్ ఫిలిం ఫెస్టివల్ వాయిదా పడింది. ఈ వేడుకను వచ్చే సంవత్సరం ఏర్పాటు చేసే విషయాన్ని నిర్వాహకులు పరిశీలిస్తున్నారు. గతేడాది ఈ ఫెస్టివల్‌కు మొదటిసారి హాజరైన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా.. దానికి సంబంధించిన జ్ఞాపకాలను తాజాగా పంచుకుంది.
ప్రియాంక.. తన భర్త నిక్ జోనస్‌తో కలిసి గతేడాది జరిగిన 72వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు హాజరైంది. అప్పుడు తీసిన ఫొటోలను ఓ వీడియోగా రూపొందించి తన సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిందీ నటి. నిక్, ప్రియాంకల జంట రెడ్ కార్పెట్‌పై ఉన్న సమయంలో భయంకరమైన వర్షం కురిసింది.