బాలీవుడ్లో 50కిపైగా సినిమాల్లో నటించి.. విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకున్న నటి ప్రియాంకా చోప్రా. హాలీవుడ్లో బలమైన ముద్ర వేసిన బాలీవుడ్ నటుల్లో ప్రియాంక ఒకరు. 2000 సంవత్సరంలో మిస్ ఇండియా, మిస్ వరల్డ్‌గా గుర్తింపు పొందిన ఈ నటి.. ఆ తర్వాత తన సినీ కెరీర్‌ను ప్రారంభించి ఇంతటి ఘనత సాధించింది.
ఇటీవలే సినీ కెరీర్లో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. తను మిస్ ఇండియా గెలుచుకున్నప్పటి వీడియోను గుర్తుచేసుకుంటూ స్పందించింది ప్రియాంక. ఈ క్రమంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోనూ షేర్ చేస్తూ.. ఆ సమయంలో తన స్టైల్, నడిచే విధానంపై సరదాగా చమత్కరిచింది.