మహమ్మారి కరోనాను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించేందుకు సినీతారలు ముందుకొస్తున్నారు. ఇటీవల 'ఆర్ఆర్ఆర్' చిత్ర హీరోలు రామ్చరణ్, ఎన్టీఆర్ ఈ వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించగా ఇప్పుడు ఇదే బాటలో బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియాంకా చోప్రా చేరింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)తో కలిసి నేడు(గురువారం) తన ఇన్స్టాగ్రామ్ వేదికగా లైవ్లో అవగాహన కల్పించనుంది.
వారూ నిర్బంధంలోనే..
ప్రియాంకా చోప్రా ఆమె భర్త నిక్ జోనస్ ఎనిమిది రోజులుగా స్వీయ నిర్బంధంలో ఉన్నారు. ఈ వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నట్లు తెలిపారు.