తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నెట్​ఫ్లిక్స్​ చిత్రంలో మెరవనున్న ప్రియాంక చోప్రా

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మరో హాలీవుడ్​ చిత్రంలో నటించనుంది. రాబర్డ్ రోడ్రిగ్స్​ తెరకెక్కించనున్న ఈ సినిమా ఇటీవలే అమెరికాలో మొదలైంది. యాక్షన్​ అడ్వెంచర్​గా రూపొందనున్న ఈ చిత్రం నెట్​ఫ్లిక్స్​లో ప్రసారం కానుంది.

By

Published : Aug 22, 2019, 4:52 PM IST

Updated : Sep 27, 2019, 9:36 PM IST

ప్రియాంక చోప్రా

క్వాంటికో సిరీస్​, బేవాచ్ సినిమాతో హాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన ప్రియాంక చోప్రా మరో చిత్రంలో నటించనుంది. వి కెన్ బీ హీరోస్ అనే పేరుతో రానున్న ఈ సినిమా నెట్​ఫ్లిక్స్​లో ప్రసారం కానుంది.

హాలీవుడ్​ నటులు పెడ్రో పాస్కల్​, సుంగ్​ కాంగ్​, క్రిస్టోఫర్ మెక్​డొనాల్డ్​ ప్రముఖ పాత్రల్లో కనిపించనున్నారు. బాల నటులుగా అకిరా అక్బర్, నాథన్ బ్లెయిర్, ఆండ్రూ డియాజ్, ఆండీ వాల్కెన్, హాలా ఫిన్లీ నటించనున్నారు.

ఇదీ కథ

సూపర్ హీరో తల్లిదండ్రులను గ్రహాంతర వాసులు కిడ్నాప్​ చేస్తారు. వారిని కాపాడటానికి పిల్లలంతా జట్టుగా చేరతారు. ఇందుకోసం వాళ్లు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు, ఏమేం సాహాసాలు చేశారో ఈ సినిమాలో చూపించనున్నారు.

ఇటీవలే "అలిటా: బాటిల్ ఏంజెల్"ను తెరకెక్కించిన రాబర్ట్ రోడ్రిగ్స్​ సొంత కథతో 'వి కెన్​ బి హీరోస్'​ను రూపొందించనున్నాడు. చిత్ర షూటింగ్​ ఇటీవలే అమెరికా టెక్సాస్​లో మెుదలైంది.

ఇదీ చూడండి: జిమ్​లో సమంత ఫీట్.. అంతర్జాలంలో వీడియో హిట్​!

Last Updated : Sep 27, 2019, 9:36 PM IST

ABOUT THE AUTHOR

...view details