తెలంగాణ

telangana

ETV Bharat / sitara

భారతీయ సంప్రదాయానికి ప్రియాంక జై - మంగళసూత్రంతో ప్రియాంక

ఆమె బాలీవుడ్​ నటి. ఇప్పుడు ఎక్కువగా పనిచేస్తోంది హాలీవుడ్​ సినిమాల్లో. పెళ్లాడింది అమెరికా వాసిని. అయినా భారతీయ సంప్రదాయాలను కొనసాగిస్తూనే ఉంది.

భారతీయత సంప్రదాయాన్ని మరువని ప్రియాంక

By

Published : Apr 25, 2019, 4:58 PM IST

మాజీ ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రా పాప్‌ సింగర్‌ నిక్‌ జోనాస్‌ను వివాహం చేసుకొన్న విషయం తెలిసిందే. తాజాగా ప్రియాంక ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో టీషర్ట్​తో ఉంది ఆ చిత్రంలో. మెడలో వజ్రాలతో పొదిగిన నల్లపూసల మంగళ సూత్రాన్ని ధరించింది ప్రియ. ఆమె విదేశీయుడిని పెళ్లాడినా భారతీయతను, సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోలేదంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.

మంగళ సూత్రంతో కనిపించిన ప్రియాంక

ABOUT THE AUTHOR

...view details