లింగ వివక్ష లేని సమాజాన్ని త్వరలోనే చూస్తామని బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా ఆశాభావం వ్యక్తం చేసింది. ఆమె పిల్లలు లింగ వివక్ష గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది.
"నేను లింగ వివక్ష లేని సమాజం కావాలని కోరుకునే వ్యక్తిని. నా జీవితకాలంలో అలాంటి సమాజాన్ని చూస్తానని ఆశిస్తున్నా. లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌కు బదులుగా సినిమా అని, మహిళా దర్శకులకు బదులుగా దర్శకులని, మహిళా అథ్లెట్లకు బదులుగా అథ్లెట్లు అని త్వరలోనే అంటారని అనుకుంటున్నా. లింగ వివక్ష లేని సమాజంలో నా పిల్లలు పెరుగుతారని నమ్ముతున్నా. ఇప్పుడిప్పుడే మహిళలు బయటకు వస్తున్నారు. నాాలాగే వారికి.. వారి తల్లిదండ్రులు మద్దతుగా నిలుస్తారని ఆశిస్తున్నా."
- ప్రియాంకా చోప్రా, బాలీవుడ్ నటి