దేశవ్యాప్తంగా రైతులు చేస్తోన్న ఆందోళలనపై స్పందించింది నటి ప్రియాంక చోప్రా. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆమె... డిసెంబర్ 6న రైతుల ర్యాలీపై ట్వీట్‌పై చేసింది. ప్రభుత్వం ఈ సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపాలని ట్వీట్లో పేర్కొంది. పంజాబ్ సింగర్ దిల్జీత్ దోసంజే ట్వీట్‌కు మద్దతుగా ఈ కామెంట్ చేసింది. అయితే ఈమె స్పందనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నెటిజన్ల ట్రోల్స్..
ప్రియాంక ట్వీట్‌పై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేశారు. 'కిసాన్ అంటే అర్థం కూడా తెలియదు కానీ రైతులకు మద్దతుగా నిలుస్తానని చెబుతోంది. వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని చెబుతోంది. అమెరికాలో ఉన్న ఆమెకు ఈ బిల్లులపై అసలు అవగాహన ఉంటుందా?. ఇది కేవలం పబ్లిసిటీ కోసమే చేస్తోంది' అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.