తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ది వైట్​ టైగర్'​లో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ప్రియాంక - telugu latest cinema news

రామిన్​ బహ్రానీ దర్శకుడిగా రాజ్​కుమార్​ రావ్​ హీరోగా వస్తున్న సినిమా 'ది వైట్​ టైగర్'​. ఈ సినిమాలో కథానాయిక ప్రియాంక చోప్రా. తాజాగా ఈ సినిమాలో తన పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇన్ స్టాలో ఈ విషయాన్ని తెలియజేసింది.

Priyanka Chopra concludes filming for ''The White Tiger''
'ది వైట్​ టైగర్'​లో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ప్రియాంక

By

Published : Dec 16, 2019, 1:01 PM IST

రాజ్​కుమార్​ రావ్​ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'ది వైట్ టైగర్'. తాజాగా ఈ సినిమాలో ప్రియాంక చోప్రా తన పార్ట్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. 'ఫారెన్​హీట్'​ 451, '99 హోమ్స్'​ ఫేమ్​ దర్శకుడు రామిన్​ బహ్రానీ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. అరవింద్​ అడిగా రాసిన నవల ఆధారంగా వస్తున్న ఈ మూవీ.. నెట్​ఫ్లిక్స్​లో విడుదల కానుంది.

ఈ సందర్భంగా ఇన్​స్టా వేదికగా ప్రియాంక సంతోషం వ్యక్తం చేసింది.

"కష్టపడి పనిచేసే సిబ్బంది, అద్భుతమైన నటులతోఈ ప్రాజెక్టులో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్నాను."

-ప్రియాంక చోప్రా, సినీ నటి

ముకుల్ డియోరా, నెట్‌ఫ్లిక్స్ సంస్థ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ప్రియాంక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహిరిస్తోంది. ఓ గ్రామంలో టీ కొట్టులో పనిచేసే స్థాయి నుంచి నగరంలోనే అత్యంత సంపన్న వ్యవస్థాపకుడిగా ఎదిగిన వ్యక్తి ప్రయాణామే ఈ చిత్ర ప్రధాన.

ABOUT THE AUTHOR

...view details