తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆ సినిమాలో కీర్తి సురేశ్​ బదులుగా ప్రియమణి - bollywood news

'మైదాన్​' సినిమాలో హీరోయిన్​గా కీర్తి సురేశ్​ బదులు జాతీయ నటి ప్రియమణిని ఎంచుకున్నారు. శనివారం ఈ విషయం ప్రకటించింది చిత్రబృందం.

కీర్తి సురేశ్​ బదులుగా ప్రియమణి
కీర్తి సురేశ్​-ప్రియమణి

By

Published : Jan 19, 2020, 6:20 AM IST

బాలీవుడ్​లో హీరో అజయ్ దేవ్​గణ్ నటిస్తున్న చిత్రం 'మైదాన్'. ప్రముఖ ఫుట్‌బాలర్ సయ్యద్‌ అబ్దుల్‌ రహీం జీవితం ఆధారంగా తీస్తున్నారు. ఇందులో తొలుత కీర్తి సురేశ్ హీరోయిన్​గా ఎంపికైంది. కానీ ఇటీవలే ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. ఇప్పుడీ పాత్రలో జాతీయ నటి ప్రియమణి కనిపించనుంది. ఈమె ఈ రోల్​కు కచ్చితంగా సరిపోతుందని భావించిన చిత్రబృందం ఈ నిర్ణయం తీసుకుందట.

'మైదాన్​'కు అమిత్‌ రవీంద్రనాథ్‌ శర్మ దర్శకుడు. జీ స్టూడియోస్, బేవివ్యూ ప్రాజెక్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ ఏడాది నవంబర్‌ 27న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మైదాన్ ఫస్ట్​లుక్ పోస్టర్

ప్రియమణి.. తెలుగులో వెంకటేశ్​ సరసన 'అసురన్‌'లో నటిస్తుందని టాక్. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ 'తలైవి'లోనూ జయ సన్నిహితురాలు శశికళగా కనిపించనుంది.

ABOUT THE AUTHOR

...view details