'పెళ్లైన కొత్తలో', 'యమదొంగ', 'రగడ'లాంటి చిత్రాల్లో నటించి అలరించిన నటి ప్రియమణి. ప్రస్తుతం రానా హీరోగా వస్తున్న 'విరాటపర్వం' సినిమాలో ఈ హీరోయిన్ బెల్లి లలిత అనే పాత్రలో కనిపించనుంది. వెంకీ ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కథానాయికగా సాయి పల్లవి నటిస్తోంది. తాజాగా ఈ చిత్రం గురించి ప్రియమణి మాట్లాడుతూ తన పాత్ర గురించి చెప్పుకొచ్చింది.
"ఇదొక యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న గొప్ప చిత్రం. సినిమా అంతా 1992నాటి నక్సలిజం నేపథ్యంలో ఉంటుంది. నా పాత్ర గురించి అందరికీ చెప్పాలని ఉంది. చాలా తీవ్రమైన పాత్ర అని చెప్పగలను. సినిమా ఎప్పుడు ప్రారంభమౌతుందా అని నేను ఎదురు చూస్తున్నా."