హాలీవుడ్ సినిమాలకు ఇండియాలో మంచి మార్కెట్ ఉంది. అందుకు అనుగుణంగానే భారీ బడ్జెట్ చిత్రాలను పక్కా ప్రమోషన్స్తో భారత ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు నిర్మాతలు. అందులో భాగంగా ఇక్కడి నటులతో డబ్బింగ్ చెప్పించడానికి ముందుకొస్తున్నారు. ఇప్పటికే 'లయన్ కింగ్'లోని పాత్రలకు నాని, జగపతిబాబు, బ్రహ్మానందం వంటివారు తమ గొంతు అరువిచ్చారు.
తాజాగా 'ఫ్రోజెన్ 2' లోని ఎల్సా పాత్ర కోసం నిత్యామీనన్ డబ్బింగ్ చెప్పనుంది. ఇప్పుడు ఈ లిస్టులో ప్రియదర్శి కూడా చేరిపోయాడు. ఇదే చిత్రంలోని ఐకానిక్ పాత్ర అయిన ఫన్నీ స్నో మ్యాన్ ఒలఫ్కు డబ్బింగ్ చెప్పనున్నాడీ హాస్యనటుడు.